AP: అనంతపురం జిల్లాలో జోరుగా వర్షాలు కురవడంతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడులో జలపాతం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. 200 అడుగుల ఎత్తు నుంచి జలపాతం జాలువారుతోంది. వర్షాలతో కోన జలపాతానికి కొత్త అందాలను సంతరించుకుంది. ఈ జలపాతాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు.