భారీ వర్షాలు.. ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు: మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి

32చూసినవారు
భారీ వర్షాలు.. ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు: మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి
AP: భారీ వర్షాల నేపథ్యంలో ఆర్‌ అండ్‌ బీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ప్రజా రవాణా వ్యవస్థకు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్