ఏపీ వ్యాప్తంగా 403 మండలాలపై 'మొంథా' తుఫాన్ ప్రభావం చూపుతోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో అధికారులకు ఆయన మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. 7 జిల్లాల్లో ఎక్కడికక్కడ నిలిచినపోయిన వాహనదారులకు ఫుడ్, వాటర్ అందించాలన్నారు. రాత్రి 9 గంటల నుంచి రేపు తెల్లవారుజాము వరకు భారీ వర్షాలు పడతాయని, ఇక అర్థరాత్రి 11.30 నాటికి తుఫాన్ తీరం దాటొచ్చని ఆయన చెప్పారు.