AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. మార్కాపురం, కర్నూలు, ప్రకాశం, ఉభయ గోదావరి, విజయవాడ, కృష్ణా, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కర్నూలు జిల్లా నందవరంలో భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో భారీ ఈదురుగాలులకు 15 ఇళ్లు, వృక్షాలు నేలకూలాయి.