ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏలూరు, కృష్ణా,
ఎన్టీఆర్, ప్రకాశం, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.