AP: ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని APSDMA తాజాగా తెలిపింది. దీని ప్రభావంతో రేపు కృష్ణా, ఎన్టీఆర్, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం కోనసీమ నగరంలో అత్యధికంగా 46 మి.మీ., మలికిపురంలో 36.2 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.