బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బుధ, గురువారాల్లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు,
ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందంది. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.