నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

158చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా నుంచి రాయలసీమ పలు ప్రాంతాల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ వెల్లడించారు. నేడు నెల్లూరు, రాయలసీమ జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద ఉండొద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్