ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు: వాతావరణ శాఖ

24చూసినవారు
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు: వాతావరణ శాఖ
AP: తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో సెప్టెంబర్ 22 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. సెప్టెంబర్ 25న కూడా భారీ వర్షాలు కొనసాగవచ్చు. ఈ వాతావరణ వ్యవస్థ కారణంగా ఏపీ తీరంలో గంటకు 55–65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్