AP: కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడును ఆనుకుని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినట్లు APSDMA తెలిపింది. దీంతో మంగళవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోయే 4 రోజులు కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.