AP: విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలో శనివారం భారీ ఈదురుగాలులు వీచాయి. ఆ గాలులకు గ్రామంలో విద్యుత్ స్తంభం, మామిడి చెట్టు ఇంటిపై కూలాయి. స్తంభం పడిన సమయంలో విద్యుత్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఇంట్లో వృద్ధ దంపతులు కంచుబారిక దుర్గయ్య, ఎల్లయ్యమ్మ నివసిస్తున్నారు. ముందస్తు చర్యలలో భాగంగా విద్యుత్ నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.