AP: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై వ్యాఖ్యలు చేసే ముందు తన బాధ్యతలను గుర్తుపెట్టుకోవాలని సూచించారు. హోంమంత్రి అనితను ఉద్దేశించి ‘మేకప్ మంత్రి’ అని, ఎండలో తిరిగితే కిలోల కొద్దీ మేకప్ పడుతుందని సెటైర్లు వేశారు. తాము చేసే రాజకీయ పోరాటం వేరని, అధికారంలో ఉండి చేసే వ్యవహారాలు తమకు సాధ్యం కావని అన్నారు.