కేరళంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన హీరోయిన్ హనీరోజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆమెతో సెల్ఫీ దిగేందుకు అభిమానులు ఎగబడటంతోపాటు కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. సెల్ఫీ దిగుతూ ఆమె నడుమును తాకి ఇబ్బంది పెట్టారు. దీంతో అసౌకర్యానికి గురైన హనీరోజ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటనపై, సెలబ్రిటీల పట్ల ఇలా ప్రవర్తించిన అభిమానులపై విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.