పాడేరు ఏజెన్సీలో కొనసాగుతున్న హైఅలర్ట్

47చూసినవారు
పాడేరు ఏజెన్సీలో కొనసాగుతున్న హైఅలర్ట్
అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచేందుకు అదనపు బలగాలను మోహరించి, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తున్నారు. ఏజెన్సీలో డ్రోన్ల ద్వారా నిఘాను పటిష్టం చేశారు. గత నవంబరులో మారేడుమిల్లిలో హిడ్మాతో సహా పలువురు మావోయిస్టులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినప్పటి నుండి ఏజెన్సీలో భయాందోళనలు నెలకొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్