AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రతికూల పరిస్థితులతో తుఫానుగా రూపాంతరం చెందలేదు. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఇవాళ నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అతిభారీ వర్షాలు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప్రకాశం, వైఎస్సార్, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.