ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

4544చూసినవారు
ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
తిరుపతి పరకామణి కేసు విచారణలో ఏపీ పోలీసుల పనితీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రికార్డులు సీజ్ చేయాలన్న సెప్టెంబర్ 19 ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. పోలీసు శాఖ నిద్రపోతోందని, అసలు వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ఆక్షేపించింది. ఐజీ పోస్టు లేదనే కారణంతో ఆదేశాలు అమలు చేయరాదని నిలదీసింది. తప్పు చేసిన వారికి సహకరించి ఆధారాలు తారుమారు చేసేందుకు వీలు కల్పించారని వ్యాఖ్యానించింది. రికార్డులు సీజ్ చేసి హైకోర్టు ముందు ఉంచాలని సీఐడీ డీజీకి ఆదేశాలు జారీ చేస్తూ, కేసు విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్