సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు ఆగ్రహం

32చూసినవారు
సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు ఆగ్రహం
ఫ్రీ లిటిగేషన్ కౌన్సిల్ ఫోరం పేరుతో సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ యూనిఫాం ధరించి కౌన్సిలింగ్ చేయడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమేనని, సివిల్ వివాదాలతో పోలీసులకు సంబంధం ఏంటని హైకోర్టు నిలదీసింది. విశాఖ పోలీసులను ప్రజలకు ఏ చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చి స్టేషన్లకు పిలిపిస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు, ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్