టీటీడీ అధికారుల తీరుపై హైకోర్టు అసహనం

26చూసినవారు
టీటీడీ అధికారుల తీరుపై హైకోర్టు అసహనం
AP: తిరుమల పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సీజ్ చేసిన ఫైళ్లు, ప్రాథమిక దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సీఐడీ సమర్పించింది. ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ నెల 27న ఈవో న్యాయస్థానం ముందు హాజరుకావాలని ఆదేశించింది. లేనిపక్షంలో రూ.20 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.