చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

23చూసినవారు
చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు
AP: తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గంలో ఈనెల 5న జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం వైసీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియలో జరిగిన దాడులు, అక్రమాలపై దాఖలైన పిటిషన్ మేరకు, ఆరు మండలాల్లోని ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పోలింగ్ ప్రక్రియను మొత్తం రికార్డ్ చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఫుటేజిని భద్రపరిచి కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్