AP: బీసీ రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు తీర్పుపై రేపే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 1995లో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని, ఆ తర్వాత
వైసీపీ ప్రభుత్వం వాటిని 24 శాతానికి తగ్గించిందని ఆరోపించారు. దీంతో 16,800 మంది బీసీలకు పదవులు దూరమయ్యాయని అన్నారు. తాము మళ్లీ 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే
వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించారని చెప్పారు. బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. 45 ఏళ్లుగా బీసీలు టీడీపీకి వెన్నుముకగా ఉన్నారని అన్నారు.