కేంద్ర బడ్జెట్ 2026-27లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అంచనాకు హై లెవల్ స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ కమిటీ వివిధ రంగాల్లో AI ప్రభావాన్ని, ఉద్యోగాలపై దాని ప్రభావాన్ని పరిశీలిస్తుంది. సర్వేలు, విశ్లేషణల ఆధారంగా AI అభివృద్ధి, నియంత్రణ, సమర్థ వినియోగానికి సంబంధించి చర్యలను సిఫార్సు చేయనుందని నిర్మలమ్మ తెలిపారు.