AP: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ
వైసీపీ శాప్ కార్యాలయం వద్ద నేడు నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విజయవాడ రెడ్ సర్కిల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విజయవాడకు
వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేస్తున్నారు. శాప్ కార్యాలయం వైపు ఎవరినీ వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.