తెలుగు రాష్ట్రాల్లో బుధవారం నాడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా పొట్టిపాడులో 40.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవ్వగా, కర్నూలు జిల్లా లద్దగిరి, విజయనగరం జిల్లా నెలివాడలో 39.9 డిగ్రీలు నమోదయ్యాయి. బాపట్లలో అత్యల్పంగా 34 డిగ్రీలు నమోదయ్యాయి. తెలంగాణలోని కొత్తగూడెంలో 41 డిగ్రీలతో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, యాదాద్రి భువనగిరిలో 38 డిగ్రీలు నమోదయ్యాయి.