AP: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం లండన్‌లో హిందుజా గ్రూప్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో, హిందుజా గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిపినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నంలో హిందుజా పవర్‌ప్లాంట్ సామర్థ్యాన్ని 1,600 మెగావాట్లు పెంచడం, రాయలసీమలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు వంటి పలు ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వంతో హిందుజా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.