ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం పెరిగిపోయింది. అయితే, ఏఐ చాట్‌బాట్ ఇచ్చిన సలహా మేరకు హెచ్ఐవీ నిరోధక మందులు (PrEP/PEP) వాడి ఢిల్లీకి చెందిన 45 ఏళ్ల వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఎటువంటి వైద్య పరీక్షలు, డాక్టర్ సంప్రదింపులు లేకుండా మందులు వాడటంతో అతనికి 'స్టీవెన్స్ జాన్సన్ సిండ్రోమ్' అనే తీవ్రమైన వ్యాధి సోకింది. వైద్య నిపుణులు ఏఐ సలహాలను కేవలం అవగాహన కోసమే పరిగణించాలని, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు.