ప్రొ లీగ్‌ టోర్నీ కోసం భారత హాకీ జట్టు ఎంపిక.. మన్‌ప్రీత్‌ సింగ్‌పై వేటు

2675చూసినవారు
ప్రొ లీగ్‌ టోర్నీ కోసం భారత హాకీ జట్టు ఎంపిక.. మన్‌ప్రీత్‌ సింగ్‌పై వేటు
ప్రొ లీగ్‌ టోర్నీ కోసం భారత హాకీ జట్టు ఎంపికలో స్టార్‌ ప్లేయర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, దిల్‌ప్రీత్‌ సింగ్‌, కృషన్‌ బహదూర్‌ పాఠక్‌లకు చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికా పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించి, ఒక ఆటగాడికి నిషేధిత ఉత్ప్రేరకం కలిపిన చూయింగ్‌ గమ్‌ ఇచ్చినట్లు హాకీ ఇండియా (హెచ్‌ఐ) వర్గాలు వెల్లడించాయి. దీనిపై కోచ్‌ క్రెయిగ్‌ ఫుల్టన్‌ అభ్యంతరం వ్యక్తం చేసినా, హెచ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు, చీఫ్‌ సెలక్టర్‌ అతన్ని ఒప్పించడంలో సఫలమయ్యారు. ఈ చర్య తీవ్ర క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినందుకే తీసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్