నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

35చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
AP: తీవ్ర తఫానుతో అతిభారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దీని కారణంగా పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు బుధవారం కూడా సెలవులు ప్రకటించారు. విజయనగరం, మన్యం, అనకాపల్లి, అల్లూరి, విశాఖ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కడప, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సెలవులు కొనసాగుతాయి. కాకినాడలో ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించారు. నెల్లూరు, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కళాశాలలకు కూడా నేడు సెలవు ఉంది.

సంబంధిత పోస్ట్