సినిమా రంగంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. హాలీవుడ్‌లో రూపొందుతున్న ‘మిస్అలైన్డ్’ (Misaligned) చిత్రం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో టిల్లీ నార్వూడ్ అనే డిజిటల్ AI నటి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇది ప్రపంచ సినీ చరిత్రలోనే పూర్తిస్థాయి AI హీరోయిన్‌తో రూపొందుతున్న తొలి ప్రధాన చిత్రంగా ప్రచారం పొందుతోంది. ‘పార్టికల్ 6’ అనే AI ఆధారిత స్టూడియో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ కామెడీ-డ్రామా.