వర్షాకాలం ఇంటి తోటల ఏర్పాటుకు అనువైన సమయం. ఈ సీజన్‌లో చెట్టు చిక్కుడు, గోరు చిక్కుడు, ధనియాలు, బెండ, పొద్దు తిరుగుడు, గుమ్మడి, బీర, చుక్కకూర, పాలకూర వంటి కూరగాయల విత్తనాలను నాటుకోవచ్చు. కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా మొక్కలను నాటడం, బ్యాచ్‌లలో విత్తనాలు వేయడం ద్వారా నిరంతర దిగుబడి పొందవచ్చు. పాలకూర, చుక్కకూరను పైపుల్లో, కొత్తిమీరను బ్లాక్ టబ్‌లలో, చెట్టు చిక్కుడు, బెండను బ్లాక్ టబ్‌లు, గ్రో బ్యాగులలో నాటుకోవచ్చు. విత్తనాలు నాటిన తర్వాత పరిస్థితులకు తగ్గట్టుగా నీరు పెట్టాలి. ఇంటి తోటల పెంపకం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందవచ్చు.