AP: మొంథా తుఫాన్ 28న అర్ధరాత్రి కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. ఈ మేరకు ఆదివారం విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. భారీ హోర్డింగ్‌లను ముందుగానే తొలగిస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నామన్నారు.