వైద్యులపై హోంమంత్రి అనిత ఆగ్రహం

31చూసినవారు
వైద్యులపై హోంమంత్రి అనిత ఆగ్రహం
AP: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హోంమంత్రి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో హోమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో అన్ని విభాగాలను క్షణ్ణంగా పరిశీలించారు. ఆస్పత్రికి రోజుకి ఎంతమంది రోగులు వస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై అనకాపల్లి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారితో ఫోన్ మాట్లాడారు. తక్షణమే డాక్టర్, సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్