వైసీపీ విష ప్ర‌చారంపై హోంమంత్రి అనిత‌ వార్నింగ్‌

12497చూసినవారు
వైసీపీ విష ప్ర‌చారంపై హోంమంత్రి అనిత‌ వార్నింగ్‌
AP: సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వంపై వైసీపీ నాయ‌కులు విష ప్ర‌చారం చేస్తున్నార‌ని హోంమంత్రి అనిత మండిప‌డ్డారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని, లేకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. క‌ల్పిత‌ కథనాలు, అబద్ధాలను ప్రచారం చేయడాన్ని వాక్ స్వాతంత్య్రంగా పరిగణించలేమన్నారు. తాము ఎప్పుడూ న్యాయమైన రాజకీయ చర్చను స్వాగతిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్