AP: విజయనగరం సబ్ జైలును హోంమంత్రి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైల్లోని రికార్డులు, వంటగది, ఖైదీలకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్‌ను కూడా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పోలీసులకు పలు సూచనలు చేస్తూ సీసీ కెమెరాల పనితీరును చెక్ చేశారు. శక్తి టీమ్స్ పనితీరుపై కూడా మంత్రి వివరాలు సేకరించారు.