ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త

1499చూసినవారు
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త
AP: ఏపీలోని నిరుద్యోగులకు హోంమంత్రి అనిత శుభవార్త అందించారు. ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, దీని ద్వారా పోలీస్, జైళ్ల, అగ్నిమాపక శాఖల్లోని ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 6 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేశామని, స్ట్రైఫండ్‌ను మూడు రెట్లు పెంచినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో విఫలమైందని ఆరోపించారు. నెల్లూరు జైలును సందర్శించిన అనిత, ఖైదీలకు మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్