నంద్యాల జిల్లాకు చెందిన సూర్యనారాయణ, లక్ష్మీబాయి దంపతులు అనంతపురంలో పెళ్లికి వెళ్లి, తిరిగి వస్తుండగా ఆటోలో బంగారు నగలున్న బ్యాగును మర్చిపోయారు. ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ ఆ బ్యాగును గమనించి, నేరుగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు ఆ బ్యాగులో 12 తులాల బంగారు నగలు ఉన్నాయని గుర్తించి, బాధితులకు ఫోన్ చేసి అప్పగించారు. నిజాయితీ చాటుకున్న చంద్రశేఖర్‌ను పోలీసులు సన్మానించగా, దంపతులు అతనికి ఆర్థిక సాయం చేసి అభినందించారు.