ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో పరువు హత్య కలకలం రేపింది. పెళ్లి కాకుండానే గర్భవతి అయిన 18 ఏళ్ల కుమార్తెను మందులు ఇప్పిస్తానని చెప్పి చంబల్ నదికి తీసుకెళ్లిన తండ్రి, ఆమెను నీటిలో ముంచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసి కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. విచారణలో నిజం వెలుగుచూడగా, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.