కూలిన ఆస్పత్రి స్లాబ్.. మహిళకు తీవ్ర గాయాలు(VIDEO)

16078చూసినవారు
ఆస్పత్రి స్లాబ్ కూలడంతో చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన రాజస్థాన్‌లోని సుజన్‌గఢ్‌లో జరిగింది. చికిత్స కోసం ఓ మహిళ ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. అయితే ఆస్పత్రి నుంచి బయటకు వెళ్తున్న క్రమంలో ఆమె తలపై ఒక్కసారిగా రూఫ్ కూలింది. దీంతో ఆమె కిందపడిపోయింది. ఆ వెంటనే లేచి పక్కకు పరిగెత్తింది. ఈ ఘటనతో ఆస్పత్రికి వచ్చిన ఇతర పేషెంట్లు భయాందోళనకు గురవుతున్నారు. ఈ దృశ్యాలు CCTVలో రికార్డయ్యాయి. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్