త్రీడీ ప్రింటర్‌తో వేడివేడి పిజ్జా, చాక్లెట్లు!

8703చూసినవారు
త్రీడీ ప్రింటర్‌తో వేడివేడి పిజ్జా, చాక్లెట్లు!
కంప్యూటర్‌లో ప్రింట్ నొక్కగానే పేపర్‌పై అక్షరాలు రావడం మనకు తెలుసు. కానీ, అదే ప్రింట్ బటన్ నొక్కితే వేడివేడి పిజ్జా, నచ్చిన ఆకారంలో చాక్లెట్, ఇష్టమైన కేక్ ప్లేట్‌లోకి వస్తే? ఇప్పుడు త్రీడీ ప్రింట్ టెక్నాలజీ నేరుగా తినే విధంగా ఆహారాన్ని అందిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని లగ్జరీ రెస్టారెంట్లలో వాడుతున్న ఈ ఫుడ్ టెక్నాలజీ, త్వరలోనే మన వంటగదుల్లోకి కూడా సాధారణ నిత్యావసర వస్తువులా అడుగుపెట్టబోతోంది. 3డీ ప్రింటెడ్ ఫుడ్ అంటే కంప్యూటర్‌లో రూపొందించిన నమూనా ఆధారంగా ఆహార పదార్థాలను పొరలుగా అమర్చి ప్రత్యేక ఆకారాల్లో తయారుచేసే విధానం. చాక్లెట్, పిండి, పండ్ల ప్యూరీలు, కూరగాయల మిశ్రమాలు, ప్రోటీన్ పేస్ట్‌లు… తదితర పదార్థాలను క్యాట్రిడ్జ్‌లలో నింపి ప్రింటర్ ద్వారా ముద్రిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్