AP: కూటమి ప్రభుత్వం పేదల కోసం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 30వ తేదీన విజయవాడలో 24 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలను అందించనుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా,
ఎన్టీఆర్ జిల్లాలలోని పలు కుటుంబాలకు ఈ లబ్ధి చేకూరనుంది. లబ్ధిదారులకు యాజమాన్య హక్కుతో పాటు బ్యాంకు లోన్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో 28 వేల కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఇళ్ల పట్టాలు అందించారు.