వచ్చే నాలుగేళ్లలో ఇళ్ల స్థలాలు మంజూరు: మంత్రి పార్థసారథి

2242చూసినవారు
వచ్చే నాలుగేళ్లలో ఇళ్ల స్థలాలు మంజూరు: మంత్రి పార్థసారథి
AP: ఇళ్ల స్థలాల మంజూరు పై మంత్రి కొలుసు పార్థసారథి రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. వచ్చే నాలుగేళ్లలో అర్హతగల ప్రతి పేదవారికి పక్కాఇల్లు నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ మేరకు అర్బన్ లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున నివాస స్థలాలు మంజూరు చేసి, రూ.2.50 లక్షలు అందజేస్తామని తెలిపారు. అదనంగా BC, SCలకు రూ 50 వేలు చొప్పున, STలకు రూ 75 వేలు నుంచి రూ 1 లక్ష చొప్పున అదనంగా నిధులు మంజూరు చేయాలని CM చంద్రబాబు నిర్ణయించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్