AP: రాష్ట్రంలో 2029 నాటికి పేదలందరికీ సొంతింటి కల సాకారం చేస్తామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బుధవారం, నిర్మాణం పూర్తయిన ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణతో కలిసి ఒక ఇంటిని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం 17 నెలల్లోనే రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్లను నిర్మించి పేదలకు అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు.