పేదలకు ఇళ్లు.. దరఖాస్తు గడువు ఈ నెల 14 వరకు పొడిగింపు

81చూసినవారు
పేదలకు ఇళ్లు.. దరఖాస్తు గడువు ఈ నెల 14 వరకు పొడిగింపు
AP: సొంతిల్లు లేని పేదల కోసం ప్రభుత్వం పీఎం ఆవాస్‌ గ్రామీణ్‌ యోజన పథకం 2.0 కింద దరఖాస్తు గడువును ఈ నెల 14 వరకు పొడిగించింది. ప్రస్తుతం సర్వేతో పాటు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సొంత స్థలం ఉన్నవారు ఇల్లు మంజూరు చేయాలని, స్థలం లేని వారు స్థలం, ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకోవచ్చు. పేదలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గృహనిర్మాణ సంస్థ పీడీ మురళీమోహన్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్