AP: శ్రీకాకుళంలో డయేరియా విజృంభణకు 'ఈ-కోలీ' బ్యాక్టీరియా కారణమని అధికారులు నిర్ధారించారు. నీటి నమూనాల్లో 11 చోట్ల ఈ-కోలీ ఉన్నట్లు గుర్తించారు. నిన్నటి వరకు 162 కేసులు నమోదవ్వగా, 112 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. మనుషుల ప్రేగుల్లో ఉండే ఈ బ్యాక్టీరియా జీర్ణక్రియకు సహాయపడినా.. కలుషితమైన ఆహారం, నీటి ద్వారా విరేచనాలు, వాంతులకు కారణమవుతుంది.