కొబ్బరికాయలో నీరు ఎలా వస్తుంది?.. రహస్యం ఇదే!

3423చూసినవారు
కొబ్బరికాయలో నీరు ఎలా వస్తుంది?.. రహస్యం ఇదే!
భారత్‌లో కొబ్బరికాయకు మతపరమైన, సామాజిక, ఆర్థిక ప్రాముఖ్యత ఉంది. పూజలు, శుభకార్యాల్లో దీన్ని ఉపయోగిస్తారు. కొబ్బరికాయలోని నీరు చెట్టు వేర్ల ద్వారా నేల నుంచి గ్రహించబడే భూగర్భ జలం. ఇది 'జైలెమ్' అనే వ్యవస్థ ద్వారా కాండం, ఆకులు, పండ్లకు చేరుతుంది. వేర్లు సేకరించిన నీరు పోషకాలతో ఫిల్టర్ చేయబడి, రుచికరమైన కొబ్బరి నీరుగా మారుతుంది. ప్రపంచంలో భారతదేశం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలు కొబ్బరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి. కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్