ఎన్ని EMIలు కట్టకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?

7197చూసినవారు
ఎన్ని EMIలు కట్టకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
హోమ్ లోన్ EMIలు ఎన్ని చెల్లించకపోతే ఇంటిని బ్యాంకు వేలం వేస్తుంది? అన్న డౌట్‌ ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. అయితే ఒక్క EMI మిస్ అయిన వెంటనే బ్యాంకు ఇంటిని వేలం వేయదు. RBI నిబంధనల ప్రకారం వరుసగా మూడు నెలలు (సుమారు 90 రోజులు) EMIలు చెల్లించకపోతే రుణ ఖాతాను NPA (నిరర్థక ఆస్తి)గా ప్రకటిస్తారు. ఆ తర్వాత SARFAESI చట్టం కింద 60 రోజుల నోటీసు ఇస్తారు. అప్పటికీ బకాయిలు చెల్లించకపోతే ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం ప్రక్రియ ప్రారంభింస్తుంది. వేలానికి ముందు మరో 30 రోజుల అమ్మకపు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. సాధారణంగా మొదటి EMI డిఫాల్ట్ నుంచి ఇంటి వేలం వరకు 8 నుంచి 12 నెలల సమయం పడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్