నాన్ వెజ్ ప్రియులు చేపలను ఇష్టంగా తింటారు. అయితే వాటి నాణ్యతను గుర్తించడం చాలా ముఖ్యం. ఆహార నిపుణుల ప్రకారం, చేపల చర్మం మెరుపు, మాంసం రంగు, బరువు, గట్టిదనం, కళ్ళు, మొప్పల రంగు, వాసన, పొలుసులు, తోక, ముళ్ళు వంటి అంశాలను పరిశీలించి నాణ్యమైన చేపలను ఎంచుకోవాలి. తాజా చేపలు నిగనిగలాడుతూ, ప్రకాశవంతమైన కళ్ళు, ముదురు ఎరుపు మొప్పలు, సహజమైన వాసన కలిగి ఉంటాయి. కొనుగోలు చేసిన తర్వాత 1°C ఉష్ణోగ్రత వద్ద వీలైనంత త్వరగా నిల్వ చేయాలి.