వేసవిలో ఉపశమనం కలిగించే పెరుగును ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అర లీటరు పాలను 3-4 నిమిషాలు మరిగించి, చల్లార్చాలి. ఆ తర్వాత శుభ్రమైన గిన్నెలో కాస్త పెరుగు వేసి బాగా కలపాలి. మట్టి కుండలో తోడు వేయడం ఉత్తమం. పాలను స్పూన్‌తో కలపడం, ఒక గిన్నె నుండి మరో గిన్నెలోకి వడపోయడం వల్ల తోడు సమానంగా పడుతుంది. ఎండాకాలంలో 4-6 గంటల్లో పెరుగు సిద్ధమవుతుంది. తోడు లేకపోతే, ఎండుమిర్చిని గోరువెచ్చని పాలలో వేసి కూడా పెరుగు తయారు చేసుకోవచ్చు.