మిరపలో కుకుంబర్ మొజాయిక్ తెగులును ఎలా నివారించాలి?

4455చూసినవారు
మిరపలో కుకుంబర్ మొజాయిక్ తెగులును ఎలా నివారించాలి?
మిరప పంటను ఆశించే వైరస్ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఎదుగుదల లోపించి, పొట్టిగా మారి, ఆకులు రంగుమారి, పూత ఉండదు. వ్యాధి సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. వ్యాధిని వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25mlను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్