2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను సమర్పిస్తూ, రక్షణ రంగానికి రూ.7.85 లక్షల కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. సైనిక ఆధునీకరణకు పెద్దమొత్తంలో నిధులు కేటాయించడంతో పాటు, రాఫెల్ యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, మానవరహిత వైమానిక వాహనాలు వంటి కీలక ప్రాజెక్టులను ప్రతిపాదించారు. విమాన భాగాల తయారీకి దిగుమతి చేసుకునే ముడి పదార్థాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయించనున్నట్లు తెలిపారు.