AP: కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం గంగూరు శివారులో గోడౌన్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 2500 బస్తాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ నిల్వకు పాల్పడిన సాంబశివరావు, సాయి మోహన్ నాయుడు పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.